The Desk… Bhimavaram : మావుళ్ళమ్మ స్వర్ణ వస్త్రనిధికి కాసు బంగారం బహుకరణ

The Desk… Bhimavaram : మావుళ్ళమ్మ స్వర్ణ వస్త్రనిధికి కాసు బంగారం బహుకరణ

పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భీమవరానికి చెందిన తటవర్తి రవీంద్ర మోహన్, ప్రత్యూష దంపతులు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరి సూర్యప్రకాశ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం దంపతులకు శేషవస్త్రం సమర్పించగా, ధర్మకర్త యండ సత్యవతి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.