🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
రెవెన్యూ ఆఫీసర్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు వార్డు అడ్మిన్ సెక్రటరీలకు సన్మానం
పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించిన కమిషనర్ యేసుబాబు

2026-2027 సంవత్సరానికిగాను ఏప్రిల్ మాసంలో 5% రిబేట్ కాలపరిమితిలో అత్యధిక ఆస్తి పన్ను వసూలు చేసి ప్రతిభ కనబరిచిన రెవెన్యూ ఆఫీసర్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు వార్డు అడ్మిన్ సెక్రటరీలను మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు శనివారం సన్మానించారు.

పురపాలక సంఘ కౌన్సిల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ :
రిబేట్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. పురపాలక సంఘ ఆర్థిక స్వావలంబనకు పన్ను వసూళ్లు చాలా కీలకమని, వసూలైన పన్నులతోనే పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించగలమని తెలిపారు.ఇంటి పన్నులు,కుళాయి పన్నులు వసూలు లో ప్రతిభ కనబరిచి నందుకు రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ లను సన్మానించారు.
సన్మానం పొందిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు :
- ప్రథమ బహుమతి: 35వ వార్డు అడ్మిన్ సెక్రటరీ రమ్య కీర్తి
- ద్వితీయ బహుమతి: 26వ వార్డు అడ్మిన్ సెక్రటరీ పద్మజ
- తృతీయ బహుమతి: 7వ వార్డు అడ్మిన్ సెక్రటరీ రంగనాథ్
- ప్రత్యేక బహుమతి: అత్యధిక అసెస్‌మెంట్లను వసూలు చేసిన 33వ వార్డు అడ్మిన్ సెక్రటరీ మనోజ్
ఈ నలుగురికి కమిషనర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన వార్డుల సిబ్బంది కూడా పన్ను వసూళ్లలో ముందుండాలని, ప్రజలకు రిబేట్ అవకాశంపై అవగాహన కల్పించి వసూళ్లు పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది,సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు.
Tadepalligudem Municipality Honors Top Tax Collectors for April Rebate Success
Municipal Commissioner M. Yesubabu commended revenue staff for excelling in property tax collections during the 5% rebate period in April for FY 2026-27. The recognition event at the council hall celebrated their role in meeting targets, boosting the municipality’s financial self-reliance.
Key Honorees :
Revenue Officer Prasad and Revenue Inspector Ashok Kumar received accolades for outstanding performance in house and water tax recoveries. Ward Admin Secretaries shone too: Ramyakeerthi (35th Ward) took first prize, Padmaja (26th Ward) second, Ranganath (7th Ward) third, and Manoj (33rd Ward) a special award for maximum assessments collected.
Commissioner’s Remarks :
Yesubabu praised the team’s efficient use of the rebate window, emphasizing that tax revenues fund essential urban infrastructure like roads and water supply. He urged other wards to create public awareness on rebates to sustain momentum.
The program, attended by municipal staff and secretariat secretaries, underscores Tadepalligudem’s push for timely collections amid statewide efforts.

