The Desk … Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమం & మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం

The Desk … Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమం & మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం

🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం 2వ వార్డులోని గాయత్రీ దేవి ఆలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు. అనంతరం 2వ వార్డులో ప్రజల ఆహ్లాదం కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కును ప్రారంభించారు.

సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ :

ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించడంతో పాటు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు.

కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ :.

పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నూతన పార్కును పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్ సొసైటీకి రూ. 1,08,300/- విరాళం మిచ్చిన పురపాలక సంఘ సిబ్బంది

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఉద్యోగులు, సిబ్బంది తమ సామాజిక బాధ్యతగా రెడ్‌క్రాస్ సొసైటీకి రూ. 1,08,300/- (ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల రూపాయలు) విరాళంగా అందజేశారు.

ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చేతుల మీదుగా ఈ చెక్కును పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ :

ఆపదలో ఉన్నవారికి సేవలందించే రెడ్‌క్రాస్ సొసైటీకి మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు పిలుపునిచ్చారు.

కమిషనర్ మాట్లాడుతూ :

మున్సిపల్ ఉద్యోగులు ఎప్పుడూ సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం ,:

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెన్సస్-2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం నేటి నుండి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్ల పనితీరును పరిశీలించారు. 1వ వార్డులో ఇంటింటి సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను కలిసి వారికి పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ :

జనాభా గణన దేశ అభివృద్ధికి, ప్రణాళికల రూపకల్పనకు అత్యంత కీలకమని, ఎన్యూమరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి ఇంటి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలంతా ఎన్యూమరేటర్లకు సహకరించి సరైన సమాచారం అందించాలని శాసనసభ్యులు కోరారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఇంటి నంబరు, ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, మౌలిక వసతులు తదితర అంశాలను నమోదు చేస్తారని కమిషనర్ తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ఇది పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.

Tadepalligudem Witnesses Pension Distribution, Park Inauguration, and Census Launch

Tadepalligudem in West Godavari district hosted a series of key events on Friday, including NTR Bharosa pension payouts, the unveiling of a new municipal park, a generous donation to Red Cross, and the kickoff of the national Housing Census 2027.

Pension Drive and Park Opening :

At Gayatri Devi Temple in the 2nd ward, Government Whip and Tadepalligudem MLA Bolisetti Srinivas, alongside District Collector C. Naga Rani, personally handed cash pensions to beneficiaries under the NTR Bharosa scheme. The scheme ensures doorstep delivery for the vulnerable, reflecting the government’s commitment to welfare.

They later inaugurated a new municipal park built for public recreation. Whip Srinivas highlighted the administration’s focus on urban infrastructure and home-delivered pensions for all eligible citizens.

Collector Naga Rani urged officials to prevent any inconvenience to pensioners and called for community upkeep of the park.

Municipal Commissioner M. Esu Babu, staff, and locals attended in large numbers.

Red Cross Donation :

In a gesture of corporate social responsibility, Tadepalligudem Municipal Council staff donated Rs 1,08,300 to the West Godavari Red Cross Society. The cheque was presented through the Whip and MLA to Collector Naga Rani in the Commissioner’s presence.

Collector Naga Rani praised the voluntary contribution, emphasizing service to the needy. The MLA appealed for broader participation in welfare activities, while Commissioner Esu Babu affirmed ongoing staff involvement in such initiatives.

Housing Census Begins :

As part of Census 2027’s house-listing phase, enumerators started door-to-door surveys in Tadepalligudem from today. Senior officials, including the Collector, Whip, and Commissioner, inspected operations in the 1st ward, issuing guidelines to enumerators.

Collector Naga Rani stressed accurate recording of house numbers, ownership, family details, and amenities for national development planning. The MLA urged public cooperation, with the Commissioner assuring data confidentiality to dispel myths.

Tahsildar, supervisors, and enumerators participated. These events underscore Tadepalligudem’s proactive governance amid Andhra Pradesh’s urban renewal drive.