The Desk … Tadepalligudem : సెన్సస్–2027 హౌస్ లిస్టింగ్ ప్రారంభం

The Desk … Tadepalligudem : సెన్సస్–2027 హౌస్ లిస్టింగ్ ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

భారత ప్రభుత్వం చేపట్టిన సెన్సస్–2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్ల పనితీరును పరిశీలించారు. 1వ వార్డులో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లను కలిసి పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు.

కలెక్టర్ మాట్లాడుతూ… జనాభా గణన దేశ అభివృద్ధికి, ప్రణాళికల రూపకల్పనకు కీలకమని, ఎన్యూమరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి ఇంటి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించి సరైన సమాచారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఇంటి నంబరు, యజమాని పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, మౌలిక వసతులు తదితర అంశాలను నమోదు చేస్తారని కమిషనర్ తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.