The Desk … Tadepalligudem : రెడ్‌క్రాస్‌కు మున్సిపల్ సిబ్బంది విరాళం

The Desk … Tadepalligudem : రెడ్‌క్రాస్‌కు మున్సిపల్ సిబ్బంది విరాళం

పశ్చిమగోదావరి జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఉద్యోగులు, సిబ్బంది తమ సామాజిక బాధ్యతగా రెడ్‌క్రాస్ సొసైటీకి రూ.1,08,300 (ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ విరాళం శుక్రవారం అందజేశారు.

ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ చెక్కును పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి సేవలందించే రెడ్‌క్రాస్ సొసైటీకి మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఉద్యోగులు ఎప్పుడూ సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.