ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
తాడేపల్లిగూడెం 2వ వార్డులోని గాయత్రీ దేవి ఆలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు. అనంతరం ప్రజల ఆహ్లాదం కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించడంతో పాటు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నూతన పార్కును పరిశుభ్రంగా ఉంచుకుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

