The Desk … Tadepalligudem : నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

The Desk … Tadepalligudem : నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ న్యూస్ :

ఎన్నికల వ్యయంపై నిఘా

ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి

ప్రచారంలో హద్దు దాటితే చర్యలు తప్పవు

ఖర్చు ప్రతిపైసాకూ లెక్క చెప్పాల్సిందే

అనుమతి లేకుండా ప్రచారం వద్దు

ప్రలోభాలకు తావివ్వొద్దు.. నిబంధనలు పాటించాల్సిందే

➖అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ యం. యేసుబాబు (తాడేపల్లిగూడెం)

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని తాడేపల్లిగూడెం అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ యం. యేసుబాబు స్పష్టం చేశారు. శుక్రవారం పురపాలక సంఘం కౌన్సిల్ హాలులో తుది అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల వ్యయ పరిమితులు, ప్రచార నిబంధనలు, పోలింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఖర్చునూ నమోదు చేసి, రోజువారీ వ్యయ నివేదికలు సమర్పించాలని సూచించారు.

ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. లౌడ్‌స్పీకర్లు, బ్యానర్లు, పోస్టర్లు, ఎన్నికల సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్ణీత సమయం తర్వాత ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కమిషనర్ కోరారు.