The Desk … Eluru : కొత్త పాలకవర్గాలకు ఎంపీ పుట్టా అభినందనలు

The Desk … Eluru : కొత్త పాలకవర్గాలకు ఎంపీ పుట్టా అభినందనలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

అభివృద్ధికి అంకితం కావాలి

ప్రజల నమ్మకమే ప్రామాణికం

పదవులు బాధ్యతలు.. ప్రజాసేవే ప్రథమ కర్తవ్యం

ప్రజా తీర్పుకు అభివృద్ధితో ప్రతిఫలం ఇవ్వాలి

➖MP (మహేష్ పుట్టా)

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవే లక్ష్యంగా కొత్త పాలకవర్గాలు పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన చింతమనేని సాయి నవ్యశ్రీ, వైస్ చైర్మన్ బొర్రా చలమయ్యతో పాటు జడ్పీటీసీ సభ్యులకు
శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలోని వివిధ మండలాల్లో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేశారు. పదవులు అలంకారప్రాయంగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశాలుగా భావించి, జిల్లా సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.