🔴 అనకాపల్లి జిల్లా : అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :
బంగారం 20.5 గ్రాములు వెండి 1.060 కిలోలు
నూకాంబిక హుండీకి భక్తుల నీరాజనం
అమ్మవారిపై అచంచల విశ్వాసం.. హుండీకి భారీ కానుకలు
నమ్మకానికి నిదర్శనం.. నూకాంబిక హుండీ ఆదాయం
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబికమ్మవారిపై భక్తులకున్న అచంచల విశ్వాసానికి హుండీ కానుకలు నిదర్శనంగా నిలిచాయి. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన హుండీల లెక్కింపులో 77 రోజులకు సంబంధించి రూ.54,08,952 నగదు ఆదాయం లభించింది. వీటితో పాటు 20 గ్రాముల 50 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 60 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించారు.
దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు) మాట్లాడుతూ :
భక్తులు సమర్పించిన ప్రతి కానుకను ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. అమ్మవారిపై భక్తులు చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి వై.వి.రమణి, దేవాదాయ శాఖ తనిఖీదారు బి.వసంతకుమార్, ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

