🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :

జిల్లా పరిషత్ పీఠంపై పెదవేగి జెడ్పీటీసీ చింతమనేని సాయి నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె ఎన్నిక పూర్తికాగా.. ప్రమాణ స్వీకారం అనంతరం అభినందనల వెల్లువెత్తింది. తండ్రి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తల్లి రాధారాణి, భర్త వంకినేని పృథ్వీకృష్ణ తదితర కుటుంబ సభ్యులు తొలుత శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, మేయర్ రెడ్డి అప్పలనాయుడు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. తనను అభినందించిన ప్రతి ఒక్కరికీ నవ్యశ్రీ కృతజ్ఞతలు తెలిపారు.

