🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
తూర్పు గోదావరి జిల్లాలో గల లైసెన్సు కోసం రవాణాశాఖకు సంబంధించిన సేవలన్నీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉన్నవనీ,
డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవల కోసం Sarathi Portal https://sarathi.parivahan.gov.in/sarathiservice
వాహనాలకు సంబంధించిన సేవల కోసం Vahan Portal
https://vahan.parivahan.gov.in
పై వెబ్సైట్ల ద్వారా నేరుగా గాని, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన మీసేవ, ఈసేవ, కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుననీ తెలియ చేశారు. సంబంధిత రుసుమును కూడా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు అని తెలియ చేశారు.
ఈ కార్యాలయ సేవల కోసం ఎటువంటి దళారులను సంప్రదించవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రవాణా శాఖ ద్వారా సేవలు పొందాలకునే ప్రజలు అవసరమైన సమాచారాన్ని నేరుగా రవాణాశాఖ కార్యాలయాన్ని సంప్రదించి పొందవచ్చుననీ తూర్పు గోదావరి జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది ఎవరైనా లంచం కోరిన యెడల, వినియోగదారులు స్వయంగా గాని, వాట్సాప్ సందేశం ద్వారా గాని, లేదా ఫోన్ కాల్ ద్వారా గాని ఫిర్యాదు చేయవలసిందిగా కోరడమైనది.
సేవల వివరాలు మరియు ఫిర్యాదుల కోసం :
జిల్లా రవాణాధికారి (DTO) ఆర్. సురేష్ వారి మొబైల్ నెంబర్: 9281607020 ను కార్యాలయం పని వేళ్లలో సంప్రదించవచ్చు.

