🔴 ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ :
మహిళా భద్రత, సైబర్ నేరాలు, నూతన క్రిమినల్ చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు..
పోలవరం డీఎస్పీ కే. జైకృష్ణ సూచనలతో..
సిఐ బి. కృష్ణకుమార్ ఆధ్వర్యంలో..
ఎస్ఐ అప్పారావు.. బోడిగూడెం హైస్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గుడ్‌టచ్–బ్యాడ్‌టచ్, చట్టపరమైన రక్షణ, సైబర్ నేరాలకు గురైతే 1930, అత్యవసర సమయంలో 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మొబైల్ ఫోన్ పోయినప్పుడు CEIR ద్వారా బ్లాక్/ట్రాక్ చేసే విధానాన్ని వివరించారు. వేధింపులు, అనుమానాస్పద పరిణామాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

