🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
డాక్టర్ అరుణ భిక్షకు కే.వీ. సత్యనారాయణ ప్రతిభా పురస్కారం
కళారత్న కే.వీ. సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో కే.వీ. సత్యనారాయణ ప్రతిభా పురస్కారం–2026 ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత కే.వీ. సత్యనారాయణను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రొఫెసర్, డాక్టర్ అరుణ భిక్షకు ప్రతిభా పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

