🔴 విజయవాడ : ది డెస్క్ :
విజయవాడలో పాస్టర్ల సమావేశం
50 మందికి సన్మానం
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో..
అమరావతికి జీవం పోద్దాం – 116/- రూపాయలు సాయంచేద్దాం కార్యక్రమంలో భాగంగా..అమరావతి అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో విజయవాడలోని హోటల్ ఇలపురం రెస్టారెంట్లో రూ.116/- కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాస్టర్ల సమావేశానికి సుమారు 200 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా 50 మంది పాస్టర్లను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ సన్మానించారు. అనంతరం అమరావతి అభివృద్ధికి తమ వంతు సహకారంగా CRDA కోడ్ ద్వారా రూ.116 చొప్పున విరాళాలు 200 మంది పాస్టర్లు అందించారు. అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

