🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్:
స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 13వ వార్డు శివాలయం వద్ద కాలువ గట్టు శుభ్రతా కార్యక్రమం శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు స్వయంగా పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
కాలువ గట్టు వద్ద పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలను సిబ్బందితో కలిసి తొలగించారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, వార్డు సచివాలయ, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

