The Desk … Eluru : ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం– ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం– ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, అభివృద్ధి–సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్బన్‌ ఛాలెంజింగ్‌ ఫండ్‌ ద్వారా నియోజకవర్గంలో రహదారి పనులను వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరులో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని, అర్హులకు ఇళ్ల మంజూరుపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఓ మహిళకు తోపుడు బండిని అందజేశారు.

వినాయక చవితి అన్నదానంలో ఎమ్మెల్యే :

స్థానిక 41వ డివిజన్‌ చోడిదిబ్బ కృష్ణుడి గుడి వద్ద వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు.