The Desk … Eluru : DMF నిధులతో ఏలూరులో అభివృద్ధి పనులు

The Desk … Eluru : DMF నిధులతో ఏలూరులో అభివృద్ధి పనులు

🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :

రూ.38.37 కోట్లు సమీకరణ.. రూ.7.18 కోట్లే ఖర్చు

లోక్‌సభలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ ప్రశ్నకు కేంద్రం సమాధానం

జిల్లా ఖనిజ ఫౌండేషన్‌ (DMF) నిధులతో ఏలూరు జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర రంగాల్లో పనులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి సతీష్‌చంద్ర దూబే తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు గురువారం ఆయన సమాధానమిచ్చారు.

గత ఐదేళ్లలో ఏలూరు జిల్లాకు DMF కింద రూ.38.37 కోట్లు సమకూరగా.. రూ.20.86 కోట్ల పనులకు కేటాయింపులు జరిగాయి. అయితే ఇప్పటివరకు రూ.7.18 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం 192 పనులు చేపట్టగా.. వీటి ద్వారా సుమారు 93,900 మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపింది.

DMF నిధుల్లో 70 శాతం వరకు ఆరోగ్యం, విద్య, తాగునీరు, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి వంటి ప్రాధాన్యతా రంగాలకు.. మిగిలిన 30 శాతం మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, పర్యావరణ తదితర పనులకు వినియోగించాలని PMKKKY-2024 మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం DMF ఖాతాలను CAG ఆడిట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.