🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు ఆదివారం నందిగామలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ :
తమ ఉద్యోగాలు కష్టపడి సాధించుకున్నవేనని, వాటిపై అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం చేయడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. గత ఐదేళ్లలో డీఎస్సీ నోటిఫికేషన్ రాక తీవ్రంగా ఎదురుచూశామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
‘‘మూడు రోజులు వెతికినా ఒక్క డీఎస్సీ బాధితుడు కనిపించలేదు. మేము ఒక్క పిలుపు ఇవ్వగానే నిజమైన లబ్ధిదారులు ర్యాలీకి తరలివచ్చారు. ఇదే అసత్య ప్రచారానికి సమాధానం’’ అన్నారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల్లో 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని, త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఎస్సీ సాధించిన ఉపాధ్యాయుల విజయాన్ని అవమానించడం సరికాదన్నారు.

