The Desk … Nandigama : ఆధ్యాత్మికతతోనే శాంతి, సౌభ్రాతృత్వం.. సంప్రదాయాల పరిరక్షణ అందరి బాధ్యత➖ఎమ్మెల్యే సౌమ్య

The Desk … Nandigama : ఆధ్యాత్మికతతోనే శాంతి, సౌభ్రాతృత్వం.. సంప్రదాయాల పరిరక్షణ అందరి బాధ్యత➖ఎమ్మెల్యే సౌమ్య

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ గీత మందిర్‌ సెంటర్‌లోని సత్యసాయి మందిరంలో నిర్వహించిన ఆషాఢ మాస సారె కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, సత్యసాయి కమిటీ సభ్యులతో కలిసి సారె కార్యక్రమాన్ని నిర్వహించారు.

సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ ఆచార, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భక్తి, సేవ, మానవత్వం వంటి విలువలను ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.