🟡 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ న్యూస్ :
అవినీతికి తావివ్వొద్దు.. అభివృద్ధిని ఆపొద్దు
నూతన పాలకవర్గానికి ఎంపీ పుట్టా మహేష్ దిశానిర్దేశం
ఎన్నికలతో రాజకీయ విభేదాలకు ముగింపు పలికి, ఇక ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు అవినీతికి తావులేకుండా సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో పుట్టా మహేష్ మాట్లాడుతూ :
అభివృద్ధి పనులకు అధికారులు కూడా సహకరించాలని, జంగారెడ్డిగూడెంను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో పట్టణం మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. కేంద్ర పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాప్రతినిధులు ఏ అవసరమైనా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. సభలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదనపైనా స్పందిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు చర్చించి వస్తే సమష్టిగా నిర్ణయం తీసుకుందామని తెలిపారు.

