The Desk … Annavaram : గిరిప్రదక్షిణకు పటిష్ట బందోబస్తు

The Desk … Annavaram : గిరిప్రదక్షిణకు పటిష్ట బందోబస్తు

🔴 కాకినాడ జిల్లా : అన్నవరం : ది డెస్క్ న్యూస్ :

భక్తుల భద్రతకు భారీ భద్రత

అన్నవరం కొండ చుట్టూ ఖాకీల నిఘా

బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన కాకినాడ ఎస్పీ బిందుమాధవ్

కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షిణకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ తెలిపారు. సోమవారం గిరిప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ సిబ్బందికి తగు సూచనలు తెలియజేస్తూ :

రద్దీ ప్రాంతాల్లో అదనపు నిఘా, బారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలని, వైద్య సేవలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో గిరిప్రదక్షిణలో పాల్గొనాలని కోరారు.

ఈ పరిశీలనలో పెద్దాపురం డీఎస్పీ తిలక్, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, దేవస్థానం ఈవో సూర్య చక్రధరరావు పాల్గొన్నారు.

Tight Security for Annavaram Giripradakshina

Police deploy elaborate security arrangements to ensure devotees’ safety

Elaborate security arrangements have been made for the Giripradakshina of Lord Sri Veera Venkata Satyanarayana Swamy at Annavaram on the occasion of Karthika Pournami, Kakinada District SP G. Bindhu Madhav said.

The SP inspected the Giripradakshina route on Monday and reviewed the security arrangements. He directed police personnel to intensify surveillance at crowded locations, regulate traffic, establish barricades and ensure adequate parking facilities.

Special assistance, medical services and ambulance facilities were also directed to be made available for senior citizens, women, children and persons with disabilities. He urged devotees to follow police instructions and maintain discipline throughout the procession.

Peddapuram DSP Tilak, SB DSP Satyanarayana, Prathipadu CI Surya Apparao, Annavaram SI Sriharibabu and Devasthanam Executive Officer Surya Chakradhara Rao were present.