🔴 అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :
అమ్మవారి చిత్రపటాలతో వైద్య బృందానికి సత్కారం
గీతం వైద్య బృందానికి ఆలయ మర్యాదలు
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తజనుల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారిని ఆదివారం గీతం యూనివర్సిటీ వైద్య బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, పాలకవర్గ సభ్యులు వైద్య బృందానికి అమ్మవారి చిత్రపటాలను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారినాగేష్ తదితరులు పాల్గొన్నారు.

