🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
ప్రజల నమ్మకమే ప్రామాణికంగా పాలన సాగాలి
నగర ప్రగతికి కొత్త పాలకవర్గం కృషి చేయాలి
➖MP (మహేష్ పుట్టా)
ఏలూరు నగర అభివృద్ధికి నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మేయర్ రెడ్డి అప్పలనాయుడును పూలబొకే, శాలువాతో సత్కరించి అభినందించారు. నూతన పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

