The Desk … Anakapalli : లోక కల్యాణానికి రుద్రాభిషేకం

The Desk … Anakapalli : లోక కల్యాణానికి రుద్రాభిషేకం

🔴అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :

వేదమంత్రాల నడుమ రుద్ర హోమం

ఆధ్యాత్మిక శోభతో అమ్మవారి ఆలయం

సర్వదోష నివారణకు మహా రుద్ర హోమం

నూకాంబిక సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ

కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా.. అనకాపల్లి గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో లోక కల్యాణార్థం రుద్ర హోమం, మహా శివాభిషేకం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు రుద్రార్చన, పంచామృతాభిషేకం, హోమంతో భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.

సర్వజన సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కుటుంబ క్షేమం, సర్వదోష నివారణే లక్ష్యంగా ఈ క్రతువు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్లబాబు) తెలిపారు. భక్తులకు స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోమం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.