The Desk … Eluru : కర్నూలు కేటుగాడు కటకటాల్లోకి… 14 రోజుల రిమాండ్

The Desk … Eluru : కర్నూలు కేటుగాడు కటకటాల్లోకి… 14 రోజుల రిమాండ్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : ది డెస్క్ :

సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని బాలికలను, మహిళలను వేధిస్తున్న కేటుగాళ్లపై ఏలూరు రూరల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బాలికను సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురిచేసిన కర్నూలు జిల్లా వాసి పరంపోగు విల్సన్ బాబును ఏలూరు వన్‌టౌన్ సీఐ కె. రామకృష్ణ చాకచక్యంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

ఫిర్యాదు వెంటనే…వేగంగా స్పందించిన వెంకటేశ్వరరావు (ఎస్ఐ) :

ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియా ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడింది. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో బాధితురాలు ఖాతాను బ్లాక్ చేసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు అసభ్యకరంగా వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేయగా…సీఐ రామకృష్ణ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ :

మహిళల భద్రతే లక్ష్యం..
సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.