🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఏలూరు పెరుగు చెట్టు సెంటర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో వాసవీమాతను శాకంబరి దేవి రూపంలో వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన సతీమణి మీనా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
ప్రజలందరికీ వాసవీమాత ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన వాసవీమాతను శాకంబరి రూపంలో అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

