The Desk … Eluru : కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైసీపీ ఎజెండా➖ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైసీపీ ఎజెండా➖ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఎమ్మెల్యే కార్యాలయం : ది డెస్క్ :

రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆరోపించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

ఇటీవల సాయికృష్ణ అదృశ్య ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపడంతో పాటు విచారణను వేగవంతం చేసిందని తెలిపారు. అయినప్పటికీ ఘటనకు కులరంగు పులుముతూ.. కుల సంఘాల నాయకులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని పక్కనబెట్టి కేవలం కుల ప్రస్తావనలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. గత ఎన్నికల్లోనూ కుల, మత రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించి విఫలమైందని, ప్రస్తుతం మరోసారి అదే విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని భంగం చేసే కుట్రలను ప్రజలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు.

YSRCP’s Agenda is to Create Discord Among Castes for Political Gain
➖ MLA Chanti

District Telugu Desam Party (TDP) President and Eluru MLA Badeti Radhakrishnayya (Chanti) alleged that YSR Congress Party (YSRCP) leaders are attempting to create divisions among castes and religions in the state to derive political benefits. He made these remarks while addressing a media conference held at his camp office in Eluru on Thursday.

Speaking on the occasion, MLA Chanti said :

Following the recent disappearance case of Sai Krishna, the government responded promptly by transferring the concerned Circle Inspector to the Vacant Reserve (VR) and expediting the investigation. Despite this, YSRCP leaders have allegedly tried to politicize the incident by giving it a caste angle and encouraging caste association leaders to spread related narratives on social media. He described this as a reflection of the party’s deteriorating political standards.

He criticized attempts to ignore the injustice suffered by an individual and instead focus solely on caste-related issues to provoke public sentiment, calling it an example of YSRCP’s divisive political culture.

MLA Chanti further stated that YSRCP had previously attempted to mislead people through caste- and religion-based politics during the last elections and had failed. He alleged that the party is once again resorting to the same strategy.

He appealed to the public to remain vigilant and recognize any attempts to disturb the peaceful atmosphere prevailing in the state.