🟡 ఏలూరు జిల్లా : ఏలూరు :ది డెస్క్ :
ఇంటింటికీ కూటమి విజయగాథలు
45 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్తాం
1.50 కోట్ల కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
ప్రజలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందించడంతో పాటు ప్రజలు స్వయం సమృద్ధిగా ఎదిగేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.
ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 కోట్ల కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాయని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ‘అన్నదాతా సుఖీభవ’ జిల్లా స్థాయి విజయోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏలూరు నియోజకవర్గంలో 45 రోజుల పాటు ఇంటింటికీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు సవివరంగా తెలియజేయాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే విధంగా పాలన సాగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

