🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్
వాసవి పార్క్ ప్రక్షాళనకు శ్రీకారం
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులోని వాసవి పార్క్‌ను శుభ్రపరిచారు. పార్క్‌లో పేరుకుపోయిన పొదలు, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
పురపాలక కమిషనర్ ఎం. యేసుబాబు స్వయంగా శ్రమదానంలో పాల్గొని సిబ్బందితో కలిసి పార్క్ పరిసరాలను శుభ్రం చేయించారు. భవిష్యత్తులో ప్రజా వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

