🔴 ఏలూరు జిల్లా : ఏలూరు/నూజివీడు : ది డెస్క్ :
రాయల్ గ్రాండ్ హోటల్లో ఘన సన్మానం
భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపిన సహచరులు
సేవలను కొనియాడిన డీఎస్పీ, పోలీసు సిబ్బంది
నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన కొప్పిశెట్టి రామకృష్ణ బదిలీపై ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో…ఆయనకు నూజివీడులో ఘన వీడ్కోలు సభ నిర్వహించారు.
పట్టణంలోని రాయల్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం నూజివీడు రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో, డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ :
రామకృష్ణ తన విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజల పట్ల సానుకూల దృక్పథం, నేర నియంత్రణలో చూపిన చొరవతో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రూరల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
పోలీస్ శాఖలో సహచరులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన రామకృష్ణకు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు.
అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Grand Farewell to CI Ramakrishna
Felicitation Ceremony Held at Royal Grand Hotel
Colleagues Extend Best Wishes for His Future
DSP and Police Personnel Appreciate His Services
A grand farewell ceremony was organized for Koppishetti Ramakrishna, who served as the Rural Circle Inspector (CI) of Nuzvid and has been transferred to the Eluru One Town Police Station.
The event was held at Royal Grand Hotel in Nuzvid under the supervision of Rural CI Nagendra Kumar and under the leadership of DSP K.V.V.N.V. Prasad.
Speaking on the occasion, several police officials stated :
Ramakrishna earned a special reputation for his discipline in duty, people-friendly approach, and proactive efforts in crime control. They noted that his contributions toward maintaining law and order within the Rural Circle jurisdiction would be remembered for a long time.
The speakers also appreciated his ability to maintain cordial relations with colleagues while discharging his responsibilities efficiently. They expressed confidence that he would achieve greater success and attain higher positions in the future.
Later, police officers and staff felicitated him with a ceremonial shawl, presented him with a memento, and conveyed their best wishes.
The programme was attended by Sub-Inspectors, police personnel, and other officials from the Rural Circle jurisdiction.

