🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజాదర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే, ఒక్కో సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. జనహితమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సేవలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

Public Welfare is the Government’s Motto
Special Focus on Resolving Public Grievances
Government Aims to Make the State a Leader in All Sectors
MLA Badeti Chanti Receives Petitions at Praja Darbar
The coalition government is working tirelessly to make the state a frontrunner in all sectors, said Eluru MLA and District President of the Telugu Desam Party, Badeti Chanti. As part of the Praja Darbar programme held at his camp office in Eluru, he received petitions from members of the public and listened to their grievances.
The MLA warmly interacted with the people, carefully examined each issue, and spoke with the concerned officials regarding their resolution. He directed officials to take immediate steps to address the problems brought to his attention. He stated that it is the responsibility of public representatives to remain accessible to the people and share in their difficulties and concerns.
Speaking on the occasion, MLA Badeti Chanti said :
Despite the financial challenges being faced by the state, the government is not compromising on the implementation of welfare and development programmes. He said that the government is giving priority to public welfare, development, and the creation of essential infrastructure with the sole objective of serving the people.
He further stated that the government is making every possible effort to resolve public issues effectively. The Praja Darbar programme has emerged as an efficient platform for understanding people’s problems directly and ensuring their timely resolution.
The MLA reaffirmed that his primary goal is to serve the people in a manner that lives up to the trust and confidence they have placed in him.

