The Desk …Duggirala :  ▪️స్వచ్ఛపథం▪️

The Desk …Duggirala : ▪️స్వచ్ఛపథం▪️

ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : దుగ్గిరాల : ది డెస్క్ :





పారిశుద్ధ్యంపై ప్రజలకు చేరువైన కార్యక్రమం

చెత్తపై పంచాయతీ ప్రత్యేక చర్యలు

పరిశుభ్రమైన గ్రామమే లక్ష్యం

రోడ్లపై చెత్త తొలగింపు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు, పంచాయతీ సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా దుగ్గిరాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ‘స్వచ్ఛపథం’ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, పంచాయతీ స్థాయి నుంచే ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, చెత్తను తొలగించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కూరగాయలు, ఆకుకూరల మొక్కలను పెంచుకోవాలని ప్రజలకు సూచించారు.

కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, మాజీ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, మాజీ ఉపసర్పంచ్ చింతమనేని శివగోపాల్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.