The Desk … Eluru : పేదలకు ఉచిత వైద్య సేవలు

The Desk … Eluru : పేదలకు ఉచిత వైద్య సేవలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :

వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం

పేదలకు నాణ్యమైన విద్య వైద్యం

➖ ఎమ్మెల్యే చంటి

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఏలూరు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, రక్త పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. శిబిరానికి వచ్చిన వారితో ఎమ్మెల్యే మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

పేదలపై విద్య, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని, అవసరార్థులకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ నాయకుడు పరిమి సత్తిపండు, కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి రామారావు శిబిరానికి మందులు అందించగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.