🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
మహిళలకు నైపుణ్య శిక్షణ
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన
టీడీపీ నేతకు పరామర్శ
నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం నందిగామ పట్టణంలోని అనాసాగరం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాస్ట్యూమ్ జ్యువెలరీతో ఉపాధి అవకాశాలు :
మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో నిర్వహించిన కాస్ట్యూమ్ జ్యువెలరీ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఎమ్మెల్యే సౌమ్య సర్టిఫికెట్లు అందజేశారు. తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దే ఆభరణాల తయారీని వృత్తిగా కొనసాగించి ఆదాయం పొందవచ్చని సూచించారు. నైపుణ్యాభివృద్ధితో మహిళలను ఆర్థికంగా సాధికారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇంటింటికీ అభివృద్ధి వివరాలు :
అనాసాగరంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సౌమ్య డోర్‌టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి పనులను అవసరం, ప్రాధాన్యత ఆధారంగా దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ నేత నగేష్‌కు పరామర్శ :
నందిగామ పాత బైపాస్ రోడ్డులో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నేత వడ్డెల్లి నగేష్‌ను ఎమ్మెల్యే సౌమ్య స్వగృహంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

