🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :
భూగర్భ జలాలు తగ్గుముఖం
నీటి పొదుపే మార్గం
నీటి వృథాకు చెక్ పెట్టండి
69 బోర్లలో తగ్గుతున్న నీటిమట్టం
లీకేజీలు అరికట్టి.. నీటిని ఆదా చేయండి
➖ జి ఆర్ మనోజ్ (ఎంపీడీవో)
ఎల్‌నినో ప్రభావం, జూలై–ఆగస్టులో అల్ప వర్షపాతం కారణంగా మండలంలోని బోర్లలో భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో నీటి వృథాను అరికట్టి పొదుపు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో జి.ఆర్. మనోజ్ సూచించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్‌లో పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన మాట్లాడారు.
మండలంలోని 69 బోర్లలో నీటి లభ్యత తగ్గుతున్నట్లు గుర్తించామని తెలిపారు. లీకేజీల నివారణ, నీటి సరఫరా వేళల నియంత్రణ, ప్రతి ట్యాప్‌కు హెడ్ ఏర్పాటు, ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైన చోట బోర్ల పూడికతీత, సబ్‌మెర్సిబుల్ మోటార్లను దిగువకు దించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. గృహాల్లో విద్యుత్ మోటార్లతో అధికంగా నీటిని తోడడాన్ని కూడా నియంత్రించాలని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనూష, వర్క్ ఇన్‌స్పెక్టర్ జానీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

