The Desk… Nandigama : పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా.. కేక్ కట్ చేసి.. అన్నదానంతో వేడుకలు

The Desk… Nandigama : పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా.. కేక్ కట్ చేసి.. అన్నదానంతో వేడుకలు

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నందిగామ గాంధీ సెంటర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్న వితరణ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని సౌమ్య ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.