🔴 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
సైబర్ నేరాలపై విద్యార్థులకు హెచ్చరిక
డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే రక్షణ
పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులు, ఫోన్ కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని నందిగామ దీక్ష కాలేజీలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో సూచించారు.
బుధవారం కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షించుకునే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు వంటి కీలక సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలోనూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సైబర్ మోసానికి గురైన సందర్భంలో ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. డిజిటల్ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భద్రతపై అవగాహన కూడా అత్యవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ హనీఫ్, అధ్యాపకులు రామారావు, భాస్కర్, ఇన్‌చార్జి గాలేషా పాల్గొన్నారు.

