The Desk…Payakaraopet : సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

The Desk…Payakaraopet : సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

🟡 అనకాపల్లి జిల్లా : పాయకరావుపేట : ది డెస్క్ :

పాయకరావుపేటలో సీఎం పర్యటన

నేతలకు బడేటి చంటి దిశానిర్దేశం

ఏర్పాట్లపై బడేటి చంటి సమీక్ష

చంద్రబాబు పర్యటన విజయమే లక్ష్యం

స్థానిక నేతలతో బడేటి చంటి భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాయకరావుపేట పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. సీఎం పర్యటనకు పరిశీలకులుగా వచ్చిన ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు.

పర్యటన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్) పాల్గొన్నారు.