The Desk… Eluru : ఏలూరు ఎంపీ నివాసంలో నేతల ఆత్మీయ భేటీలు

The Desk… Eluru : ఏలూరు ఎంపీ నివాసంలో నేతల ఆత్మీయ భేటీలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయానికి కొత్త వేదిక

పుట్టా మహేష్‌తో మంత్రి పార్థసారథి, మాగంటి బాబు భేటీ

ఒకే వేదికపై జిల్లా నేతలు.. సమన్వయంపై మంతనాలు

జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచే లక్ష్యంతో ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. వట్లూరు సమీపంలోని సీతాపురం కాలనీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ నూతన నివాసాన్ని మంగళవారం మంత్రి పార్థసారథి, మాజీ ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు.

జిల్లా రాజకీయాలు, అభివృద్ధి అంశాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలు చర్చించారు. ప్రతి నెలా ఒక ప్రజాప్రతినిధి నివాసంలో సమావేశమై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ద్వారా అభిప్రాయ భేదాలు తొలగి సమన్వయం మరింత పెరుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఎంపీతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.