🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ/వీరులపాడు : ది డెస్క్ :
స్కూటీల పంపిణీ
పవన్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు
జుజ్జూరులో పెన్షన్ల పంపిణీ
విభిన్న ప్రతిభావంతులకు నూతన స్కూటీల పంపిణీతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాల ప్రారంభం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు స్కూటీలు :
నందిగామలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన స్కూటీలను ఎమ్మెల్యే సౌమ్య అందజేశారు. ఉపాధి, విద్యా అవకాశాలకు ఇవి ఉపయోగపడాలని సూచించారు.
పవన్ జన్మదినాన రక్తదాన శిబిరాలు :
నందిగామతో పాటు వీరులపాడు మండలం జుజ్జూరులో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను ఆమె ప్రారంభించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జుజ్జూరులో పెన్షన్ల పంపిణీ :
జుజ్జూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమాల్లో జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, తంబాలపల్లి రమాదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

