🟡 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : ది డెస్క్ :
అభివృద్ధికి మద్దతివ్వండి
దెందులూరులో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపు
గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి బాట
రూ.1.38 కోట్ల రోడ్డు పనులకు భూమిపూజ
ఎన్నికల్లో గెలుపు కోసం మోసపూరిత హామీలు ఇచ్చేవారిని నమ్మకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు.
గొల్లగూడెంలో కుంకుళ్ళమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న అనంతరం, చల్లచింతలపూడి–కండ్రిగ నరసింహాపురం మధ్య రూ.1.38 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు భూమిపూజ చేశారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని ఎంపీ పేర్కొన్నారు.
చల్లచింతలపూడి స్మశానవాటికలో షెడ్డు నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.లక్ష మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామస్తుల వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పెరుగుగూడంలో ఆయుష్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

