🟡 విజయవాడ : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ భవానీపురంలోని ఆయన నివాసానికి వెళ్లి నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
వర్ల రామయ్యకు ఉన్న రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన శాసన మండలిలో రాష్ట్రానికి మరింత ఉపయోగపడుతుందని, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు.

