The Desk …Payakaraopet : గోదావరి జలాలకు ఘన స్వాగతం

The Desk …Payakaraopet : గోదావరి జలాలకు ఘన స్వాగతం

🟡 అనకాపల్లి జిల్లా : పాయకరావుపేట : ది డెస్క్ :

సీఎం పర్యటన విజయవంతం చేయాలి

ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నానికి జలహారతి

తాండవ వద్ద సీఎం పర్యటనకు టీడీపీ శ్రేణుల సమాయత్తం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించే చారిత్రక ఘట్టానికి పాయకరావుపేట సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2న తాండవ చక్కెర కర్మాగారం వద్ద గోదావరి జలాలకు జలహారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పార్టీ పరిశీలకుడు బడేటి చంటి పిలుపునిచ్చారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి అనితతో చంటి చర్చించారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు తాండవ, వరహా, శారద నదుల ప్రాంతాలకు చేరడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు కానుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కూటమి నాయకులు పాల్గొన్నారు.