🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
జిల్లా కలెక్టర్ సి. నాగరాణి ఆదేశాల మేరకు.. భీమవరం పురపాలక సంఘ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ…
పురపాలక సంఘ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో అనధికారికంగా జంతువులను వధించడాన్ని పూర్తిగా నిషేధించడమైనది.
ముఖ్యంగా గోవులు, దూడలు, గర్భంతో ఉన్న పశువులు మరియు అనారోగ్యంతో ఉన్న ఇతర జంతువులను వధించడం చట్టరీత్యా నేరమని తెలియజేయడమైనది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా అనధికారికంగా జంతువధకు పాల్పడినట్లు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రజల నుండి ఫిర్యాదులు అందినట్లయితే, అట్టి వారిపై “జంతు హింస నిరోధక చట్టం – 1960”లోని సెక్షన్ 11 ప్రకారం అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించబడునని హెచ్చరించడమైనది.
అలాగే, ఎక్కడా బహిరంగ మరియు అనధికారిక జంతువధ జరగకుండా పర్యవేక్షణ నిమిత్తం మరియు చట్టం అమలు చేయుటకు క్రింది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడమైనది.
బృంద సభ్యులు :
ఎ. రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ – టీమ్ లీడర్
(డా. ఆర్. కోటిలింగరాజు, జిల్లా
పశుసంవర్ధక శాఖ అధికారి)
డా. జయకర్ జాక్సన్, (సహాయ సంచాలకులు)
డా. హుస్సేన్, (ఉప సంచాలకులు, భీమవరం)
ఆర్. రాంబాబు, (తహసీల్దార్, భీమవరం)
వెంకటరావు, (ఆర్‌ఐ)
ఎ. రమేష్,( సీఐ, 1 టౌన్)
క్రిష్ణా జీ, (ఎస్ఐ, 1 టౌన్)
ఆర్. సోమశేఖరం, (ఎంహెచ్‌ఓ ఇన్‌చార్జ్)
అందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు
ఈ సమాచారాన్ని ముందస్తుగానే పురపాలక సంఘ పరిధిలోని అన్ని మసీదుల నిర్వాహకులకు, ముస్లిం మత పెద్దలకు మరియు కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగిందని, అందువల్ల ఎక్కడా ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు చోటుచేసుకోకుండా, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ పురపాలక సంఘ యంత్రాంగానికి ముస్లిం సోదర సోదరీమణులందరూ సహకరించవలసిందిగా కమిషనర్ రామచంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Ban on Animal Slaughter in Public Places
➖ K. Ramachandra Reddy (Commissioner)
As per the instructions of District Collector C. Nagarani, Bhimavaram Municipal Commissioner K. Ramachandra Reddy, through a press release, informed that:
Unauthorized slaughter of animals in public places within the municipal limits has been completely prohibited.
In particular, slaughtering cows, calves, pregnant cattle, and other sick animals is a punishable offense under the law. It was further warned that if any complaints are received through social media, print media, electronic media, or from the public regarding illegal animal slaughter, strict action will be taken against the offenders under Section 11 of the “Prevention of Cruelty to Animals Act, 1960,” which includes fines and imprisonment.
Further, to monitor and prevent any public or illegal slaughter activities and to ensure effective implementation of the law, a special enforcement team has been constituted with the following officials:
Team Members :
A. Rambabu, Assistant Commissioner – Team Leader
Dr. R. Kotilinga Raju, District Animal Husbandry Officer
Dr. Jayakar Jackson, Assistant Director
Dr. Hussain, Deputy Director, Bhimavaram
R. Rambabu, Tahsildar, Bhimavaram
Venkata Rao, RI
A. Ramesh, CI, 1 Town
Krishna G, SI, 1 Town
R. Somasekharam, MHO In-Charge and All Sanitary Inspectors
The Commissioner also stated
that prior information regarding these regulations has already been communicated to all mosque managements, Muslim religious leaders, and committee members within the municipal limits. He appealed to all Muslim brothers and sisters to cooperate with the municipal administration and celebrate the festival peacefully without any unlawful incidents taking place anywhere.

