🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
సర్వజన సౌభాగ్యమే సంకల్పం
మావుళ్లమ్మ సన్నిధిలో చండీ హోమం – “రేపే”
మావుళ్ళమ్మ అనుగ్రహంతో శాంతి, సౌభాగ్యాలు.. 28న చండీ హోమం
భక్తిశ్రద్ధల మధ్య ఆలయంలో హోమం..!!
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు లోకక్షేమం, సర్వజన సౌభాగ్యం, ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం విశేష చండీ హోమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
శ్రావణ పౌర్ణమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్మాత మావుళ్లమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో వేదమంత్రోచ్ఛారణలు, చండీ పారాయణం, నవావరణ పూజలు, హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి, కుటుంబాల్లో సౌఖ్యం, ప్రజలకు ఆరోగ్యం, రైతులకు సమృద్ధి, వ్యాపారులకు అభివృద్ధి, సర్వజనులకు సుఖసంతోషాలు కలగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రావణమాస పౌర్ణమి నేపథ్యంలో ఆలయ ఉత్సవ మండపంలో అష్టాదశ భుజ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించే చండీ హోమంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని ఆయన కోరారు.
శ్రావణ పౌర్ణమి పర్వదినాన నిర్వహించే ఈ విశేష వైదిక కార్యక్రమంలో భక్త కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని దేవస్థానం తరఫున ఆకాంక్షించారు.
కుటుంబ సమేతంగా తరలిరండి:
లోకక్షేమం, సర్వజన సౌభాగ్యం కోసం నిర్వహిస్తున్న చండీ హోమంలో భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు విజ్ఞప్తి చేశారు.

