The Desk … Nandigama : అధైర్య పడవద్దు – అండగా ఉంటాం➖ ఎమ్మెల్యే సౌమ్య

The Desk … Nandigama : అధైర్య పడవద్దు – అండగా ఉంటాం➖ ఎమ్మెల్యే సౌమ్య

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : ది డెస్క్ :

పరిటాలలో పర్యటించిన ఎమ్మెల్యే..!!

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నేతలను ప్రరామర్శించిన ఎమ్మెల్యే సౌమ్య

నేతల ఆరోగ్యంపై ఆరా..!!

త్వరగా కోలుకోవాలని…

వైద్యుల సూచనల మేరకు..

విశ్రాంతి తీసుకోవాలని – “సూచించిన సౌమ్య”

కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో విజయవాడలో చికిత్స పొంది, ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నేతలు గొల్లపల్లి సీతమ్మ, పరిటాల వెంకట నరసయ్య, మనగోటి శివన్నారాయణలను ఆమె వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సౌమ్య, వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.