The Desk … Bhimavaram : మావుళ్లమ్మ హుండీల ఆదాయం రూ.73.81 లక్షలు – 79 రోజుల్లో..

The Desk … Bhimavaram : మావుళ్లమ్మ హుండీల ఆదాయం రూ.73.81 లక్షలు – 79 రోజుల్లో..

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. 79 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.73,81,359 ఆదాయం లభించినట్లు దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు. అలాగే 23 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి లభించాయి.

కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చాగంటి సురేష్‌నాయుడు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిబ్బంది, పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.