🟡 ఏలూరు జిల్లా : జిల్లా తెదేపా కార్యాలయం : ది డెస్క్ :
ప్రజల విజ్ఞప్తుల మేరకు కొత్త పింఛన్ల మంజూరు
అర్హులైన వారికి కొత్త పింఛన్లు
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
➖ ఎమ్మెల్యే చంటి.
సెప్టెంబర్ మొదటి వారం నుంచి నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన డోర్టు డోర్ కార్యక్రమంలో నూతన పింఛన్ల కోసం ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల తొలి వారం నుంచి పింఛన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఎల్నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తినా ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హౌసింగ్ సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

