🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
శాంతి, సోదరభావం పెంపొందించాలి
మత సామరస్యమే సమాజ ప్రగతికి బాట
మిలాద్ ఉల్ నబీ వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి
మహ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సమాజంలో శాంతి, సోదరభావం, మానవత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన మిలాద్ ఉల్ నబీ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కర్బలా మైదానం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ పాత బస్టాండ్, పెన్షన్లైన్, తంగెళ్లమూడి, కండ్రికగూడెం సెంటర్, అశోక్‌నగర్ మీదుగా ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కుల, మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాలని, పరస్పర గౌరవంతో ఐకమత్యంగా జీవించాలని సూచించారు. మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు.

