🟡 ఏలూరు జిల్లా : ఎమ్మెల్యే కార్యాలయం : ది డెస్క్ :
పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మంగళవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎమ్మెల్యే చంటి భరోసా ఇచ్చారు.

